27-01-2026 12:42:36 AM
వరల్డ్‌కప్‌కు విండీస్ జట్టు ప్రకటన
దుబాయ్, జనవరి 26 : భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్- కోసం వెస్టిండీస్ జట్టు ను ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టుకు షై హోప్ సారథ్యం వహించనున్నాడు. మెగా టోర్నీ కోసం విండీస్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. సంచలన ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్, 25 ఏళ్ల గయానీస్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మాజీ కెప్టెన్లు జేసన్ హోల్డర్, రోవ్మన్ పావెల్ కూడా ఎంపికయ్యారు. పేసర్లుగా ఫోర్డ్, సీల్స్ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పి న్ విభాగంలో ఆకీల్ హొసేన్, రోస్టన్ చేజ్, గుడకేశ్ మోటీ చోటు దక్కించుకున్నారు.
అలాగే ఆల్‌రౌండర్ విభాగంలో విధ్వంసకర బ్యాటర్ రొమారియో షెపర్డ్ ఎంపికయ్యారు. గాయాల కారణంగా ఎవిన్ లూ యిస్, అల్జరీ జోసఫ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్ గ్రూప్ -సిలో ఉంది. ఈ గ్రూప్ లో ఇంగ్లండ్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ మిగిలిన జట్లుగా ఉన్నాయి. విండీస్ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోలకతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌కు విండీస్ జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాస న్ హోల్డర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్