calender_icon.png 13 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోపతాపాలు తగ్గాలంటే!

18-05-2025 12:00:00 AM

వివాహ బంధంలో కోపతాపాలు, అలకలు సహజం. అయితే చాలా సందర్భాల్లో ఇవి కొంత సమయం వరకే పరిమితమవుతాయి. ఈ క్రమంలో భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు వాళ్ల దగ్గర కొన్ని విషయాలను అస్సలు ప్రస్తావించకూడదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. గొడవ జరిగినప్పుడు దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు పీకల్లోతు కోపంతో ఉంటారు. ఈ సమయంలోనే ఎదుటివారిలో ఉండే ప్రతికూలతలు, లోపాలన్నీ గుర్తుకొస్తుంటాయి.

ఒక రకమైన అసహనానికి లోనవుతుంటాం. ‘నీ వల్ల ఏదీ కాదు’.. ‘నువ్వెప్పుడూ నన్ను సంతోషంగా ఉంచలేదు’.. ‘నీకు స్వార్థం ఎక్కువ’ మన ప్రమేయం లేకుండానే ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. అయితే ఇలాంటి మాటలు అవతలి వారి కోపాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. తద్వారా గొడవ పెద్దదవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు.

దీనివల్ల ఇద్దరి మధ్య ఒక్క రోజులో ముగిసిపోయే కోపతాపాలు.. రోజుల పాటు కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కోపంతో ఉన్న భాగస్వామి దగ్గర ఎంతో సంయమనం పాటిస్తే అంత మంచిది. ఈ క్రమంలో తప్పునా.. ఒప్పునా.. అవతలి వారి కోసం తగ్గే దాకా ఎవరో ఒకరు కామ్‌గా ఉండటం మంచిది. ఇక కూల్ అయ్యాక అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి.