10-01-2026 01:28:46 AM
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం చలో అశోక్‌నగర్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నిరుద్యోగుల హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై ప్రభుత్వం లాఠీచార్జి, అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.