calender_icon.png 11 January, 2026 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన దేవతల ఘన కీర్తి చాటి చెప్పాలి

10-01-2026 01:29:12 AM

  1. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
  2. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క 

ములుగు,జనవరి9(విజయక్రాంతి):వన దేవతల ఘన కీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కోరారు. గిరిజన సంస్కృతి సంప్రదాయా లు, గొట్టు గోత్రాలు,ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరు గుతున్నదని,ప్రపంచానికి ఆదివాసులు మూ ల పురుషులుగా ఉన్నారని,మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి తెలిపారు.

శుక్రవారం ఎస్‌ఎస్ తా డ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్‌లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం 251కోట్ల రూపాయల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

మే డారం జాతరలో శాశ్వత ప్రతిపాదికన జరుగుతున్న అభివృద్ధి పనులు, జాతర నిర్వహ ణ అంశాలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలావేల్పులుగా సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రసిద్ధి చెందారన్నారు. గద్దెల పునరుద్ధరణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 19నఉదయం 7గంటలకు ప్రారంభిస్తారన్నారు.18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, గద్దెల పునరుద్ధన ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.