12-12-2025 12:34:03 AM
మొత్తం 60, 361 ఓట్లలో పోలైన ఓట్లు 47,472
ఏటూరునాగారం,డిసెంబర్11(విజయక్రాంతి)గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ 78.65 శాతం నమోదు అయింది. గోవిందరావుపే ట, ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు.మూడు మండలాల్లో కలిపి మొత్తం 60, 361 ఓట్లు ఉండగా, 47,472 పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 78.65 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయి న పోలింగ్ శాతం.గోవిందరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 20,402 మంది ఉండగా, 15,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.98 శాతం నమోదు అయింది.ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలో మొత్తం ఓటర్లు 16,680 మంది ఉండగా, 13,928 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 83.50 శాతం నమోదు అయిం ది. ఏటూరునాగారం మండలంలో మొత్తం ఓటర్లు 23,279 మంది ఉండగా, 18,043 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.51శాతంనమోదుఅయింది.