31-01-2026 01:12:36 AM
నేడు భారత్, కివీస్ ఐదో టీ20
ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా
నాలుగో టీ20లో అనూహ్య ఓటమి
టీ20 ప్రపంచకప్‌కు ముందు చివరి సన్నాహక పోరు.. వన్డే సిరీస్ ఓడినా హ్యట్రిక్ విజయాలతో కివీస్ పై సిరీస్ గెలిచిన టీమిండియాకు నాలుగో మ్యాచ్‌లో షాక్ తగిలింది. ఇప్పుడు మెగాటోర్నీకి ముందు గెలుపు జోష్ అందుకునేందుకు ఆఖరి మ్యాచ్ రూపంలో చక్కని అవకాశం.. తుది జట్టులో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా పూర్తిస్థాయి జట్టుతో ఆడి దుమ్మురేపితే మాత్రం 4- సిరీస్‌ను ముగించడం ఖాయం.. మరి తిరువనంతపురంలో భారత్ మెరుస్తుందా... కివీస్ పైచేయి సాధిస్తుందా.. ?
తిరువనంతపురం, జనవరి 30: భారత్, న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ క్లైమాక్స్‌కు చేరింది. తిరువనంతపురం వేదికగా కివీస్‌తో చివరి టీ ట్వంటీ ఆడబోతోంది. వన్డే సిరీస్ పరాభవా న్ని మరిపిస్తూ హ్యాట్రిక్ విజయాలతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు గత మ్యాచ్‌లో మాత్రం చుక్కెదురైంది. తుది జట్టులో ప్రయోగాలతో మూ ల్యం చెల్లించుకుంది. అదే స మయంలో మెగాటోర్నీకి ముందు గెలుపు బాటలోకి వచ్చిన కివీస్ ఫుల్ జోష్ తో కనిపిస్తోంది. సిరీస్ గెలిచిన భారత్‌కు నాలుగో టీ ట్వంటీలో ఓటమి ఒకవిధంగా గుణపాఠమే. బ్యాటింగ్ పరంగా సంజూ శాంసన్ తప్పిస్తే కీలక ఆటగాళ్లంతా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. సంజూ మాత్రం వైఫల్యాల బాట వీడడం లేదు. నాలుగో టీ ట్వంటీలో చక్కని అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టచ్ లోకి వచ్చినట్టే కనిపించినా పేలవ ఫుట్ వర్క్‌తో వికెట్ సమర్పించు కున్నాడు.
దీంతో మెగాటోర్నీకి తుది జట్టులో తన చోటే గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. హోంగ్రౌండ్‌లో సంజూ చెలరేగాలని అటు మేనేజ్ మెంట్, ఇటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. గత మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు. ఇషాన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్‌తో ఫామ్ అందుకున్నారు. అటు హా ర్థిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా సత్తా చాటుతున్నారు. అదే సమయ ంలో శివమ్ దూబే నాలుగో టీ ట్వంటీలో విధ్వంకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
మరోవైపు బౌలింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయి. బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడగా రాణించడం లేదు. అటు హర్షిత్ రాణా వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పేసర్లు సమిష్టిగా రా ణించేందుకు ఈ మ్యాచ్ చివరి అవకాశం. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లలో ఇద్దరికే చోటు దక్కుతుంది. అక్షర్ పటేల్ కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మెగాటోర్నీకి ముందు తమ విన్నింగ్ ఫామ్ కొనసాగించాలని భావిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
తిరువనంతపురం పిచ్ సహజంగా బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం కాస్త కష్టమే. అదే సమయంలో తెలివైన షాట్లు ఆడితే క్రీజులో నిలదొక్కుకోవచ్చు. ఇక్కడ సగటు స్కోర్లు 140 మధ్య నమోదవుతున్నాయి.
తుది జట్టు అంచనా:
భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ , అర్షదీప్, బుమ్రా/హర్షిత్ రాణా
న్యూజిలాండ్: టిమ్ సిఫర్ట్, కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, చాప్మన్, జిమ్మీ నీషమ్, మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ఇష్ సోధి