31-01-2026 01:09:56 AM
పోరాడి ఓడిన ముంబై
వడోదర, జనవరి 30 : డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై ౧౧ పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ పోరాటంతో చివరి వరకూ ఉత్కంఠగా సాగినప్పటకీ గుజరాత్ దే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓ మోస్తారు స్కోరు సాధించింది. బెత్ మూనీ నిరాశపరచగా కెప్టెన్ ఆష్లే గార్డ్ నర్, అనుష్కశర్మ, సోఫీ డివైన్ రాణించడంతో గుజరాత్ జెయిం ట్స్ 6 వికెట్లకు 167 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో గుజరాత్ బౌలర్లు ఆరంభం నుంచే పైచేయి సాధించారు. హీల్ మాథ్యూస్ , బ్రంట్. సజీవన్ సజనా త్వరగానే ఔటవగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ ఒంటరిపోరాటం చేసింది. చివరి ఓవర్లో విజయానికి 26 పరుగులు చేయాల్సి ఉండగా.. హర్మన్ భారీ సిక్స ర్లు కొట్టడంతో సంచలనం నమోదయ్యే లా కనిపించింది. గార్డనర్ ఒత్తిడిలో అద్భుతం గా బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టింది. ఫలిత ంగా ముంబై 156 పరుగులే చేయగలిగింది.