17-11-2025 12:00:00 AM
బెల్లంపల్లి, నవంబర్ 16 : చివరి శ్రావణ సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోగల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానా నికి మెరుగు గణేష్ స్రవంతి దంపతులు తమ కుటుంబ సభ్యుల తరఫున రూ. 1,21,615 విలువగల వెండి నాగాభరణం, నామాలను ప్రధానం చేస్తున్నారు.
723 గ్రాముల వెండి నాగాభరణం, 30 గ్రాముల వెండి నామాలను కుటుంబ సభ్యులు మెరుగు శశింద్ర, మోక్షిత్, మెరుగు రాజేశం, విజయలక్ష్మి, మెరుగు రాజు యమున, దీప్షిక, శాన్వి, మెరుగు శ్రీనివాస్ భవాని, అనూష్ మై, స్ఫూర్తిని ల తో కలిసి అర్చకులు సతీష్ శర్మ, ఎండోమెంట్ అధికారులకు అందించనున్నారు.