calender_icon.png 17 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లికి హాజరైన చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య

17-11-2025 12:00:00 AM

చిరకాల స్నేహబంధం పెళ్లి వేడుక

కొండాపూర్, నవంబర్ 16 : ఇరవై సంవత్సరాల క్రితం పక్కపక్క మండలాల్లో ఒకేసారి ఎంపీపీగా ఎన్నికై ప్రజాసేవలో ముద్రవేసిన చిలకాల మిత్రులు, కొండాపూర్ మాజీ ఎంపీపీ డప్పు యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యల మధ్య సాగుతున్న స్నేహబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. తమ ఆత్మీయ మిత్రుడి కుటుంబ సంతోషానికి భాగస్వామ్యమవుతూ చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య హాజరై డప్పు యాదయ్య కూతురు వివాహానికి ఆశీర్వాదాలు అందించారు.

వివాహ వేడుకలో ఎమ్మెల్యేను గౌరవపూర్వకంగా స్వాగతించిన మిత్రుడు యాదయ్య పదవులు మారినా, బాధ్యతలు మారినా స్నేహం మాత్రం మారకుండా కొనసాగుతున్న గొప్ప ఉదాహరణ ఇదే అని ఆనందం వ్యక్తం చేశారు. నాయకుల అనుబంధాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి స్నేహం రాజకీయాలకు మించి మనిషితనాన్ని చాటుతుంది అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధువులు పాల్గొన్నారు.