05-07-2025 01:11:15 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రాంచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరిం చను న్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉద యం 11 గంటలకు ఆయన బాధ్యతల స్వీకా ర కార్యక్రమం ఉంటుంది. అంతకుముందు ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఉదయం 10 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు.
తర్వా త రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ఉదయం 11 గంటలకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం రాష్ట్ర కాషాయ దళపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ జాతీయ నాయకులు, బీజేపీ రాష్ర్ట నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అధ్యక్ష హోదా లో రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. రేపటి కార్యక్రమా నికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి.