గీత కార్మికులకు బడ్జెట్‌లో మొండి చేయి
24-03-2026 12:07 AM
మహబూబాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ కేవలం 98 కోట్లు మాత్రమే కేటాయించాలని, గీత కార్మికుల సంక్షేమానికి సరిపోవని, 5000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యమగాని వెంకన్న, మోడెం వెంకటేశ్వర్లు, యాదగిరి సత్యనారాయణ, కొమరయ్య,వెంకన్న, జిల్లాలోని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.




