09-11-2025 12:00:00 AM
మొదలైన సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం
కొల్లాపూర్ రూరల్ , నవంబర్8(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వీఐపీ పుష్కర ఘాట్ వద్ద శనివారం సోమశిల నుంచి శ్రీశైలం క్షేత్రానికి కృష్ణా నది మీదుగా తెలంగాణ టూరిజం లాంచీ ప్రయాణాన్ని అధికారులు మరోసారి ప్రారంభించారు. పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఎస్‌ఐ హృషికేష్ పూజలు చేసి లాంచీని ప్రారంభించారు.
హైదరాబాద్, విశాఖ ప్రాంతాల నుంచి వచ్చిన 65 మంది పర్యాటకులు నల్లమల కొండల మధ్య కృష్ణమ్మ ఒడిలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లాంచి ప్రయాణం చేశారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ పునఃప్రారంభం కావడంతో కృష్ణా తీరం పర్యాటకులతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో టూరిజం యూనిట్ ఇన్‌చార్జి ప్రేమ్ కుమార్, డిప్యూటీ మేనేజర్ ప్రభుదాస్, మాజీ సర్పం బింగి మద్దిలేటి, టూరిజం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.