17-01-2026 03:47:04 AM
ఆర్‌జీఐఏ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం
రాజేంద్రనగర్ జనవరి 16 (విజయక్రాంతి): ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆర్ జీ ఐ ఏ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ...ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని అందుకోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడప టం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పొంచి ఉన్నాయన్నారు. అదే విధంగా వాహనాలు నడిపేటప్పుడు అతివేగం ఏమాత్రం పనికిరాదన్నారు. లైసెన్సు లేకుండా ఎవ్వరు కూడా డ్రైవింగ్ చేయరాదనీ సూచించారు. ఇప్పటి వరకు జరిగే ప్రమాదాలు దాదాపు మద్యం సేవించి నడపటం వల్లనే జరిగినట్లు తెలిందన్నారు. వాహనదారులు ప్రతి ఒక్క రూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవర్ తో పాటు ఆయా వాహనాలకు సంబందించిన అన్ని ధ్రువ పత్రాలు కలిగి ఉండాలని కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీ హెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.