30-10-2025 12:00:00 AM
తుఫాన్ నేపథ్యంలో ప్రకటించిన అధికారులు
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ కారణంగా ఎడతెరిపిలే ని వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే మంగళవారం పలు జిల్లాలకు సెలవులిచ్చిన అధికారులు.... గురువారం కూడా సెలవులు ప్రకటించారు.
బుధవారం సాయం త్రం వరకు ఉన్న సమాచారం మేరకు సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు గురువా రం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పాఠాశాలల సెల వులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు.
కాలేజీల బంద్...
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీలు, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.