30-10-2025 12:31:00 AM
- ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విద్యుత్ అధికారులు!
నారాయణపేట. అక్టోబర్,29(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్‌లతో కుమ్మక్కై టెండ ర్లు స్వీకరించకుండానే ముడుపులు తీసుకొని పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు ఉ న్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఏఈలు, ఏడి ఈలు, విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ తో కలసి బినామీ పేర్లతో పనులు చేస్తూ సొ మ్ము చేసుకొంటున్నారని కొంత మంది స హచర కాంట్రాక్టర్ లు చర్చించుకుంటున్నా రు.
దీంట్లో భాగంగానే అనధికార వెంచర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లను అంచనాలు లేకుండానే పనులు పర్సెంటేజి తీసుకొని పనులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లతో అధికారులు మందు పార్టీలు కొనసాగిస్తూ కాంట్రాక్టర్ ల తో కుమ్మక్కై టెండర్లు లేకుండానే పనులు చే స్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నారాయణపేట,కోస్గీ, మక్తల్, మాగనూర్, ఉట్కూరు,మ రికల్, క్రిష్ణ దామరగిద్ద, మద్దూరు మండలా ల లోని అధికారులు మాత్రం కాంట్రాక్టర్లతో పార్టీలు తీసుకొంటూ ట్రాన్స్ఫార్మర్ ఒక్కో చోటు నుండి షిఫ్టింగ్ చేయాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని లేదంటే ఇంకా అ నుమతులు రాలేదని కాలయాపన చేస్తున్నా రు.
విసిగిపోయిన లబ్ధిదారులు అధికారుల తో ఒప్పందం కుదుర్చుకొని అధికారులకు నమ్మకం కలిగిన కాంట్రాక్టర్ కు పనులు అప్పచెప్పటం పరిపాటిగా మారింది.ఇదిలా ఉండగా స్తంభాలను షిఫ్టింగ్ చేయాలంటే అం చనాలు తప్పని సరిగా ఉండాలి.ఇక్కడ అవేమి పట్టించుకోకుండా అంతా అధికారు లు, కాంట్రాక్టర్ లు కుమ్మక్కై పాత అల్లుమినియం వైరు స్తానంలో కొత్త అల్లుమినియం వైరు వేస్తూ పాత అల్లుమినియం వైర్ ను స్టోర్ కు తరలించాలనే నిబంధనలు ఉండగా ఇక్కడ పాతఅల్లుమినియం వైరు ను కాంట్రాక్టర్లు తీసుకొని అమ్మకాలు చేస్తున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.
ఈ విధంగా ప్రభుత్వ ఆ దాయానికి గండి కొడుతున్న సందర్భము లేకపోలేదుఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ బైరంకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పొలంలో నిర్మించిన షేడ్ లో ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్ వైర్లు,అల్యూమినియం వైర్లను విద్యుత్ స్తం భాలను నిలువ చేయడం ఎంతవరకు స మంజసమని కొంత మంది సహచర కాం ట్రాక్టర్ లు చర్చించుకుంటున్నారు.ఇప్పటి కైన జిల్లా అధికారులు స్పందించి సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోనీ ప్రభు త్వ ఆదాయానికి గండి కొట్టకుండా ఇంతవరకు చేపట్టిన పనులపై విచారణ చేపట్టి సం బంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదే విషయమై స్తానిక డిఇ నర్సింగ్రావ్ నుఫోన్ లో వివరణ కోరగా ఇలాంటివి ఏమి నా దృష్టికి రాలేదు ఒక వేల ఏమైనా ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకుంటామనిఅన్నారు.