30-10-2025 12:32:39 AM
ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
జహీరాబాద్, అక్టోబరు 29 :జహీరాబాద్ పట్టణంలో వివిధ రోడ్లు ధ్వంసమై నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ధ్వంసమైన రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడటంతో గుంతలలో వర్షం నీళ్లు నిలబడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నుండి ఝరాసంగం వెళ్లే పస్సాపూర్ కమాన్ వద్ద గుంతలు పడడంతో వాటిని అధికారులు పూడ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
ఈ ప్రాంతమంతా కూడా మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో అటు మున్సిపల్ అధికారు లు గాని ఇటు రోడ్లు భవనాల శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అల్లిపూర్ వెళ్లే రహదారి దర్గా నుండి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో బీద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉండడంతో నిత్యం వారు వివిధ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుండడంతో ఈ గుంతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కంపెనీలో పనిచేసి రాత్రి వేళలో కార్మికులు వస్తుంటే గుంతల్లో నిలిచిన నీళ్లు కనబడక గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు.
మున్సిపాలిటీ కమీషనర్ గానీ మున్సిపాలిటీలో పనిచే స్తున్న అధికారులు కానీ ఈ రోడ్డు గురించి పట్టించకపోవడంతో అల్లిపూర్ గ్రామ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పస్సాపూర్ కమాన్ వద్ద ఏర్పడిన లోతైన గుంతలకు ఎలాంటి మట్టి గాని సిమెంట్ కాంక్రీట్ డాంబర్ వేయకపోవడంతో గుంతలు మరింత వెడల్పుగా మారి వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు వెళుతుం టే దాని పక్క నుంచి వెళ్తున్న పాదాచారుల పైన మురికి నీరు పడుతుండడంతో వారు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.
అటు అధికారులు, ఇటు పాలకులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోక పోవ డంతో ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ, రోడ్లు భవనాల శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడంతో ప్రజలు నిత్యం నరకం అనుభవి స్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఇరు శాఖలను సమన్వయ పరిచి జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లను, మురికి కాలువలు నిర్మించేం దుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.