02-01-2026 01:31:46 AM
కుత్బుల్లాపూర్, జనవరి 1(విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల్లో విషా దం నెలకొంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్ అసోసియేషన్‌లో 17 మంది కలిసి రాత్రి 10 గంటల సమయంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు.మద్యం సేవించి, అక్కడే వారు తయారుచేసుకున్న చికెన్ బిర్యాని, ఫిష్ కర్రీ, రోటి తిని 17 మంది అస్వస్థతకు గురయ్యా రు. వీరిలో పాండు (53) మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని చికిత్స నిమ్మిత్తం సూరారం నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమయంగా ఉండడంతో కూకట్‌పల్లిలోని రామ్ దేవ్ ఆస్పత్రికి తరలించారు.
సమా చారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.వండిన పదార్థాలను సీజ్ చేసుకొని పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. అసోసియేషన్‌లో సంవత్సరం నుంచి నిల్వ ఉన్నటువంటి పసుపు, కారం, చికెన్ చేదుగా ఉండడం వలన ఫుడ్ పాయిజన్ కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స పొందు తున్న బాధితులను బాలానగర్ ఏసీపీ విచారించి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్ల్లడిస్తామని తెలిపారు.