02-01-2026 01:32:23 AM
మంథని, జనవరి-1(విజయక్రాంతి): మంథనిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆల యం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలి పారు.గురువారం జిల్లా కలెక్టర్ మంథని లో టీ.టీ.డి దేవాలయం నిర్మాణం కోసం మం థని శివారులో అనువైన స్థలాలను పరిశీలించారు. అనంతరం లక్కేపూర్ శివాని గూడెం గుట్ట ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మంథని ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంచి దేవాలయం, కళ్యాణ మండపం నిర్మించేందుకు ప్రతిపాదన సమర్పణ కోసం అనువైన స్థలాలను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని ఆర్.డి.ఓ. సురేష్ ,తహసిల్దార్ ఆరిఫో ద్దిన్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.