18-07-2025 11:13:35 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కాజీపేట-విజయవాడ రైల్వే సెక్షన్ లో మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్లలో మూడవ లైన్ నిర్మాణం నేపథ్యంలో నాల్గవ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు బీజేపీ నాయకులు ఓలం శ్రీనివాస్, ఇందు భారతి తదితరులు విజ్ఞప్తి చేశారు. మూడవ లైన్ నిర్మాణంతో అదనంగా నాలుగవ లైన్ స్టేషన్ ల వద్ద వేస్తున్నారని, వీటితో రైల్వే స్టేషన్లో వద్ద ప్రయాణికులు నాలుగవ ప్లాట్ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.