31-01-2026 01:00:36 AM
పల్లె నాగరాజు :
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు, బోధనా సామగ్రిని, మౌలిక వసతులను కల్పించకపోవడం, బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించకపోవడంతో బడులు మూసివేత దశకు చేరుకుంటున్నాయి.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యాశాఖ ఇటీవలి కాలంలో ఉ పాధ్యాయులకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు చూస్తుంటే.. అసలు లక్ష్యం పక్కకు పోయి శిక్షణే లక్ష్యంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఏడాది పొడవున ఏదో ఒక శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చెయ్యడం ఆశాస్త్రీయం. విద్యా సం వత్సరం ప్రారంభమైనప్పటి నుంచి సుమా రు 22 రోజులు పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది
. ఈ సమయంలో విద్యార్థులు అత్యంత కీలకమైన బోధనా సమయాన్ని కోల్పోవడం జరుగుతున్నది. ఈ లెక్కలన్నీ కేవలం డిసెంబర్ నెల వరకే. విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపల ఇంకా ఎన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారో అనే ప్రశ్నలు ఉపాధ్యాయుల్లో వ్యక్తమ వుతున్నాయి. నిజానికి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మే నెలలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది.
మొదటి విడతగా మే 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు 17 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో మే 20 నుంచి 24 వరకు ఐదు రోజులపాటు 89 వేలకు పైగా టీచర్లకు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. ఈ లెక్కన మొత్తంగా 1.22 లక్షల మంది టీచర్లకు శిక్షణను అందించింది. ఇలా శిక్షణల పేరుతో కాలయాపన చేస్తుండడంతో విద్యార్థులు విలువైన సమయం కోల్పోతున్నారు.
సమయం వృథా..
అయితే బోధనా సమయం వృధా కా కుండా టీచర్లకు వేసవి సెలవుల్లోనే శిక్షణ ఇ స్తున్నామని, ఆ తర్వాత ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉండవని విద్యాశాఖ ఉన్నతాధికా రులు పలుమార్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే విద్యా సంవత్సరం ప్రా రంభమయిన తర్వాత విద్యాశాఖ మాట మార్చేసింది. తరగతులు ప్రారంభమైన త ర్వాత కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం విద్యాశాఖ అధికారుల ప్రణాళికారహిత్యాన్ని సూచిస్తుంది. బడులు ప్రారంభ మైన తర్వాత కూడా పాఠశాల గ్రంథాలయా లు, రీడింగ్ కార్నర్స్ బలోపేతం పేరిట జులై 23న జిల్లా స్థాయిలో ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు ఇద్దరు టీచర్లను ఎంపిక చేసి శిక్షణ అందించారు.
ఇది ముగిసిన తర్వాత జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్‌కు ఆగస్టు 4 నుంచి 7 వరకు సామర్థ్య నిర్మాణం కార్యక్రమం పేరిట మరో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఖాన్ అకాడమీ ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 14,15 తేదీల్లో ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ పేరుతో ప్రత్యేక శిక్షణా తరగతులు రియాంటేషన్ నిర్వహించారు.
అక్టోబర్ 27 నుంచి 30 వరకు గణితం, సై న్స్ టీచర్లకు ఎన్జీవోలో భాగంగా ప్రత్యేక శిక్ష ణ ఇచ్చారు. వీటితో పాటు కాంప్లెక్స్ సమావేశాలకు కూడా ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విధంగా విద్యా సం వత్సరం పొడుగునా ఉపాధ్యాయులను శిక్ష ణ తరగతుల పేరిట పాఠశాలలకు దూరం చెయ్యడం వల్ల సిలబస్ పూర్తి కావడం లేదు.
మూసివేత దిశగా..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు, బోధనా సామగ్రిని, మౌలిక వసతులను కల్పించలేకపోవ డం, బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయించకపోవడంతో ప్రభుత్వ బడులు మూసివేత దశకు చేరుకుంటున్నాయి. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే పర్యవేక్షణాధికారులు లేకపోవడం, శిక్షణల పేరుతో ఉపా ధ్యాయుల బోధనా కాలాన్ని విచ్ఛిన్నం చే యడం వల్ల ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు తరలిపోతున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు సైతం అప్పులు తెచ్చి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశా ల్లో చేర్పిస్తున్నారు.
ఈ ఆధునిక పోకడ కనుమరుగై, ప్రభుత్వ బడులకు మళ్లీ మహర్దశ రావాలంటే నాణ్యమైన విద్యను ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. గతంలో విద్యాహక్కు చట్టం ప్రకా రం ప్రతి పిల్లవానికి అందుబాటు దూరంలో ప్రభుత్వ బడులుండాలి. కానీ, వాటిని గ్రా మాల్లో మారుమూలన నెలకొల్పారు. నేటి బడుల మూసివేతకు ఇది కూడా ఒక ప్రధా న కారణంగా నిలిచింది. ప్రభుత్వ బడుల్లో చేరికలు తగ్గిపోతున్నాయి.
కానీ, వేలకు వేలు ధారపోసి చదువును కొనలేని పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వ బడులే ఆశా దీపాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స ర్కారీ బడుల్లో బోధనా నాణ్యత పెంపుపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. లేకపోతే, ని స్సహాయ కుటుంబాలకు, విద్యార్థులకు అ న్యాయం చేసినట్టవుతుంది. ఏ దేశమైనా అ న్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చదువే ఆలంబనవుతుంది. విద్యలో నాణ్యత సన్నగిల్లుతున్నది.
నిరుటి వార్షిక నివేదిక ప్రకారం.. దేశీయంగా ఐదో తరగతి విద్యార్థుల్లో సగం మందే రెం డో క్లాసు పాఠాలు చదువుతున్నారంటే విద్య లో నాణ్యత పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఎంత మేర ఉన్నదో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న 43,154 పాఠశాలల్లో, దాదాపు ప్రధాన భాగమైన 30 వేల పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉ న్నాయి. కనీసం వీటినైనా కాపాడుకోవాలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ శిక్షణల పేరుతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తూ నాణ్యమైన విద్యకు ఒక రకంగా ప్రభుత్వమే అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తున్నది.
ప్రైవేటుతో కుమ్మక్కు..
తెలంగాణలో ఐదు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అటువంటి పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాద్యాయుడు శిక్షణకు వెళ్లిపోతే ఆరోజు పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని తో పాఠశాలలో చదివే విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యం దెబ్బతింటుంది. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం విద్యా హక్కు చ ట్టం మూల ఉద్దేశానికి విరుద్ధం. ప్రభుత్వరంగంలో నిపుణులైన రిసోర్స్ వ్యక్తులు ఉన్న పటికీ, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ప్రైవేట్ సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని పెంచడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉ పాధ్యాయుల అనుభవాన్ని తక్కువ చేయడ మే అవుతుంది. శిక్షణల పేరిట కార్పొరేట్ సంస్థల ముద్రను ప్రభుత్వ పాఠశాలలపై వే యడం ఎంత వరకు సమంజసం? అని ఉ పాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ప్ర శ్నిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ని మ్మకు నీరెత్తనట్టుగా ఉంటున్నారు. అంటే విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రైవేటు సంస్థలతో ఒప్పందమే ముఖ్యమనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
విముక్తి కలిగినప్పుడే..
మన రాష్ట్రంలో విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఒకవైపు సీఎం ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు విద్యాశాఖ అధికారులు మాత్రం ఉపాధ్యాయులకు శిక్షణల పేరుతో బోధనకు ఆటం కం కలిగిస్తూ ప్రభుత్వ పాఠశాలల మనుగడకే ప్రమాదం వచ్చేలా నిర్ణయాలు తీసుకుం టున్నారు. అయితే ఇవన్నీ సీఎం రేవంత్‌కు తెలియకుండా జరుగుతున్నాయా లేక తెలిసే జరుగుతున్నాయా అని ఉపాధ్యాయులు, వి ద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగ పడాలే కానీ బోధనకు సంకెళ్లు వేసి విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలను పరిగణలోకి తీసుకోని ప్రైవేటు సంస్థల ఒ ప్పందాలను పునరాలోచించాలి. అంతేకాదు సరైన ప్రణాళిక లేని శిక్షణ కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను విముక్తి చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని గ్రహించాలి.
వ్యాసకర్త సెల్: 8500431793