calender_icon.png 31 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె వ్యక్తిత్వం రమణీయం

31-01-2026 12:57:49 AM

ఆచార్య మసన చెన్నప్ప :

నా 60వ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరింపబడిన ‘సంపూర్ణయోగ దర్శనం’ ఆమె వల్లనే అక్షరాకృతి ధరించింది. దానికి ఆమె ద్రవ్యదాతగా నిలిచింది.

గురువును గురువుగా భావించే కాలం కాదిది. కానీ బేబీ రమ ణి గురుభక్తి కలిగిన అమ్మాయి. ఆమె 1991--93 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో నా విద్యార్థి గా ఉంది. విశ్వవిద్యాలయ పి.జి. కళాశాలలో చదివి స్వర్ణపతక గ్రహీతలైనవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాని రమణి ఓయూ పి.జి కాలేజీ సికింద్రాబాదులో చదివి ముచ్చటగా మూడు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.

తెలుగులో సర్వోత్తమురాలిగా నిలిచినందుకు ఒకటి; విద్యార్థి నులలో ప్రథమురాలిగా నిలిచినందుకు ఒకటి, జానపద సాహిత్యంలో సర్వోన్నతురాలిగా నిలిచినందుకు పతకాలు గెలుచు కుంది. ఎం.ఏ పరీక్షలు రాయకముందే ఆమెకు వివాహమైంది. దీంతో రమణికి స్వర్ణ పతకాలు వచ్చిన విషయం నేనే చెప్పాను. అప్పటి నుంచి ఆమెకు నేనంటే గొప్ప గౌరవం. ‘విద్యా దదాతి వినయం’ అనే సూక్తికి ఆమె నిదర్శనం. 

తెలివైన అమ్మాయి..

రమణికి గల విద్యాతృష్ణను గమనించి ఆమెను పరిశోధన వైపు మళ్లించాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 26 ఏండ్లు పని చేశాను, ఆశ్చర్యం ఏమంటే 26 మంది పిహెచ్.డి విద్యార్థులకు పరిశోధనా పర్యవేక్షకునిగా ఉన్నాను. వారందరిలో మొదటి మహిళా పరిశోధక విద్యార్థి బేబీ రమణి. ‘రామాయణంలో రామరాజ్యం-ధర్మస్వామ్యం’ అనే అంశం మీద నాలుగేళ్లు శ్రమించి నా పర్యవేక్షణలో 2003లో పిహెచ్.డి డిగ్రీ సంపాదించింది ఆమె. బేబి రమణి చాలా తెలివైనది.

పిహెచ్.డి ‘వైవా’ జరుగుతుండగా ఆచార్య సుమతీ నరేంద్ర గారు ఆమెను ‘రాముడు అరణ్యంలోనే ఎక్కువ కాలం గడిపాడు కదా మరి ఎక్కడ రాజ్యం చేశాడు?’అని ఒక ప్రశ్న వేశారు. దానికి రమణి ‘రాముడు అరణ్యంలో ఉన్నా, రామరాజ్యం అయోధ్యలో ఉంది’ అని సమధానం ఇచ్చింది. భరతుడు రామునిలాగానే రాజ్యమేలిన విషయం ఆమె మాటల్లో ధ్వనించింది. ఆ అమ్మాయి తెలివికి మేడం గారు సంతోషించారు.

సార్ ఇది మీ బిక్షే!

నా ప్రోత్సాహంతో రమణి ‘నెట్’ పరీక్షకు కూర్చొని కృతకృత్యురాలైంది. వెంట నే ఆమెకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ఒక పదిహేను సం వత్సరాల తర్వాత ఆమె డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పదోన్నతి సాధించింది. బేబీ రమణి ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ నే, మరొక వైపు ఉపన్యాసకురాలిగా రాణిస్తుంది. మాతృభక్తి, గురుభక్తి, దైవభక్తి అనే మూడింటిని ఆమె త్రివేణీ సంగమంగా భావిస్తుంది.

రమణిది పరోపకార బుద్ధి. తాను పనిచేసే కళాశాలలో ఆకలిగొని చదువుకునే పేద విద్యార్థులను గమనించి, ఆమె తన ఇంటి నుంచి అన్నం, కూరలు స్వయంగా వండుకొని తెచ్చి ఇస్తుంది. ఇది ఆమె సేవాదృష్టికి ఒక చక్కని ఉదాహరణ. ‘భారతీయ సంస్కృతి పట్ల, తెలుగు సాహి త్యం పట్ల ఆమెకు గల అభినివేశానికి గుర్తు గా సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదు జాతీయ సదస్సులను నిర్వహించిం ది. ఆమె నిర్వహించిన సదస్సుల పేర్లు విం టే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

సనాతన ధర్మమంటే ఆమెకెంత ఇష్టమో తెలు సుకోవడానికి 1) నవరసాలు, 2) ఆశ్రమధర్మాలు 3) త్రి గుణాలు, 4) చతుర్విధ పురుషార్థాలు 5) అరిషడ్వర్గం అనే సదస్సులే సాక్ష్యం. బేబి రమణికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. ఆమే స్వయంగా పరిశోధన పత్రాలను టైప్ చేస్తుంది.

అంతేకాదు, కళాశాల మీద బరువు పడకుండా వాటిని స్వయంగా అన్ని ఖర్చులు భరించి సంచికారూపంలో తెస్తుంది. అధ్యాపకవృత్తిని, తన కు దైవమిచ్చిన వరంగా భావిస్తుంది. చిత్రమేమంటే అచ్చువేసిన తన సిద్ధాంత గ్రం థంతో పాటు తానే రచన చేసినా వాటిని గురుభక్తితో నాకే అంకితం చేసింది. ‘ఎందుకమ్మా నాకు అంకితం చేస్తావు?’ అంటే, ‘మీరు పెట్టినదే ఈ విజ్ఞాన బిక్ష. అందుకే మీకు అంకితం’ అని పేర్కొంది. 

ద్రవ్యదాత..

డాక్టర్ బేబి రమణి ఎన్నడో ఎం.ఏలో పాఠం చెప్పిన ఒక అధ్యాపకునిగా కాక, నన్నొక గురువుగా భావించి అడపాదడపా నా ఆరోగ్యాన్ని పరామర్శిస్తుంది. ‘ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి గురువు గారు? అని అడుగుతుంది. ఔను! లోకంలో ఇలాంటి విద్యార్థులు, గురుభక్తి కల్గినవారు ఉంటారా? అని నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. డాక్టర్ రమ ణి తన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి నన్ను ఆహ్వనించి నాకు నూతన వస్త్రాల ను బహూకరిస్తుంది.

తనకేమైనా సందే హాలుంటే అడిగి తీర్చుకుంటుంది. నా పుస్తకాలకు అక్షరాకృతి (డీటీపీ) కల్పించి, ప్రూ ఫ్ రీడింగ్ తానే చేసి శుద్ధ ప్రతులను అందిస్తుంది. నా 60వ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరింపబడిన ‘సంపూర్ణయోగ దర్శ నం’ ఆమె వల్లనే అక్షరాకృతి ధరించింది.  దానికి ఆమె ద్రవ్యదాతగా నిలిచింది.

గర్వించే అంశం..

నా ‘సంపూర్ణయోగ దర్శనం’ ఆమె మీ ద విశేషమైన ప్రభావాన్ని చూపింది. పతంజలి యోగదర్శనంలోని 195 సూత్రాలను అర్థం చేసుకున్నది రమణి. ‘ఉద్యోగం కూ డా యోగమే కదా గురువు గారు?’ అని ప్రశ్నించింది ఒకరోజు.‘ఫలాపేక్ష లేకుండా మనం ఏ పనిని సక్రమంగా చేసినా, అది యోగమే’ అని సమాధానమిచ్చాను. ప్ర శ్నించే స్వభావంతో పాటు, చెప్పిన దాన్ని అర్ధం చేసుకొని, జీవితానికి అన్వయించుకునే సుగుణం రమణిది.

బేబి రమణి ఒక విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, గృహిణిగా, రచయిత్రిగా, సమాజహితైషిగా నిలిచినందుకు ఆమెకు ‘ప్రమీలాశక్తి పీఠం-సాహిత్య పురస్కారం 2024’ అందజేయబడింది. సహనశీలత, పరోపకారబుద్ధి, కర్తవ్య పాల న, దైవ చింతన మొదలైన సుగుణాలు మూర్తీభవించిన డాక్టర్ బేబి రమణి నాకు శిష్యురాలైనందుకు నేనంతగానో గర్వపడుతున్నాను. జీవితంలో సమస్యలు రాకపో వు. వాటిని అధిగమించడానికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం తప్పు కాదు. బేబి రమణి, ఆమెకు ఏ సమస్య ఏర్పడినా వెంటనే నాకు తెలిపి, నా సలహా తీసుకోవడం ఆమె ప్రత్యేకత.

 వ్యాసకర్త సెల్: 9885654381