calender_icon.png 17 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 ఏళ్లకు సరిపడా మంజీరా నీరు అందిస్తా!

17-09-2025 12:26:04 AM

  1. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, సదాశివపేట అధికారులతో సమీక్ష

సంగారెడ్డి, సెప్టెంబర్ 16 :ప్రస్తుతానికి వచ్చే యాభై ఏళ్లకు సరిపడా సంగారెడ్డి, స దాశివపేట మున్సిపాలిటీ ల్లో మంజీరా నీ ళ్ళు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ ను డిజైన్ చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో సంగా రెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు మంజీ రా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, అర్ డబ్ల్యుఎస్, ఇరిగేషన్, హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈనెల 30 లోగా మం జీరా వాటర్ స్కీమ్ కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలన్నారు. తక్షణ నీ టి సరఫరా కోసం 15 కోట్ల రూపాయలతో తాళ్ళ పల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ, నాలుగు మండలాల్లో ట్యాంక్ లు, పైప్ లైన్ల మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు రూపొందించాల న్నారు. వచ్చే నెలలో సంగారెడ్డిలో సీఎం రే వంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు.

సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలలో మిష న్ భగీరథ నీరు ఎర్రగా వస్తున్నాయని, నీటి నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయని అధికారులకు జగ్గారెడ్డి వివరించారు. సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీలలో కొత్త కాలనీలకు అవసరమైన పైప్ లైన్లపై వివరా లు సిద్ధం చేయాలన్నారు. మంజీరా వాటర్ స్కీమ్ లో భాగంగా సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్ తో పాటు నాణ్యత గల పైప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు.

సంగారెడ్డి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్, ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో నాలుగు వార్డులకు కలిపి ఒక ట్యాంక్ చొ ప్పున ఏర్పాటు చేశామని జగ్గారెడ్డి తెలిపారు. పెరిగిన కాలనీలకు సరిపడా ట్యాంక్ ల ఏర్పాటుకు ప్రాజెక్టులో ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. 

50 ఏళ్లకు సరిపడా పైప్ లైన్ల నిర్మాణం ఉండాలి..

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ లో 50 ఏళ్ళకు సరిపడేలా మంచినీరు అం దించేందుకు కృషి చేస్తున్నానని, వచ్చే నెల 15వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది, ఈ విషయంపై జిల్లా మంత్రి దా మోదర్ రాజనర్సింహ్మతో సైతం మాట్లాడినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈనెల 30 వరకు మంజీరా సరఫరాకు సంబంధించి  కన్సల్టె న్సీ ప్రతినిధులు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చే యాలని సూచించారు.

తాను చైర్మన్ నిర్మల కలిసి ఈఎన్సీని కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించనున్నట్లు తెలిపారు. రాజంపేట నుండి హాస్టల్ గడ్డ ఈద్గా వరకు రోడ్ నిర్మాణం కు , ఫిల్టర్ బెడ్ లో సిసి రోడ్డు నిర్మాణానికి ద సరా తర్వాత శంకుస్థాప జరగాలని, వెంటనే పనులు ప్రారంభం కావాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు.