calender_icon.png 7 May, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెసా నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

07-05-2025 01:07:43 AM

జిల్లా అధ్యక్షుడిగా సి. నరసింగరావు ఎంపిక 

మహబూబ్ నగర్, మే 06 ( విజయక్రాంతి ) :  తెలంగాణ రెవె న్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెసా) మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా సి. నర్సింగరావు ( జడ్చర్ల తహసీల్దార్) ఎంపికయ్యారు.  ప్రధాన కార్యదర్శిగా దేవరకద్ర డిప్యూటీ  తహసిల్దార్ ఖలీద్ ఎక్బాల్( ఎలక్షన్), అసోసియేట్ అధ్యక్షుడిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ఏవో శంకర్ లను ప్రతిపాదించారు.

మంగళవారం హైదరాబాద్  ట్రెసా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ట్రేసా మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గాన్ని  ఏకగ్రీవంగా  త్రిష రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ సమక్షంలో ఎన్నుకున్నారు. ఈనెల 21వ తేదీన నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగును. 

  అసోసియేటెడ్ అధ్యనూతన కార్యవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లా ట్రెసా నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి డిప్యూటీ తాసిల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి,  దేవేందర్ కేసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.