07-05-2025 01:06:55 AM
జిఎం షాలేం రాజు. సింగరేణి చరిత్రలోనే మొదటిసారి మహిళ రెస్క్యూ టీం
కొత్తగూడెం మే 6 (విజయ క్రాంతి) కొత్తగూడెం సింగరేణి ఏరియా త్రీ ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ లో కొత్తగూడెం రీజియన్ పరిధిలో ఉన్న కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాలలో పనిచేయుచున్న మహిళా ఉద్యోగులకు మంగళవారం రెస్క్యూ ట్రైనింగ్ కొరకు శిక్షణ పరీక్షలను నిర్వహించారు. సింగరేణి చరిత్రలోనే మహిళలకు తొలిసారిగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పాల్గొని, మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు వివిధ స్థాయిలలో పని చేయుచున్నారని ముఖ్యంగా నూతనంగా జరిగిన రిక్రూట్మెంట్ లో,అండర్ గ్రౌండ్ మైన్ లో వివిధ స్థాయి విధులు నిర్వహించుటకు మహిళా ఉద్యోగులు,సింగరేణి సంస్థ నందుచేరినట్లు తెలిపారు.
ఆసక్తిగల వారితో పద్మావతి ఖని, కొత్తగూడెం ఏరియా, కొండాపురం మైన్ లలో పనిచేయుచున్న మహిళా ఉద్యోగులతో రెస్క్యూ ట్రైనింగ్ టీం శిక్షణ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. రెస్క్యూ ట్రైనింగ్ ను పొందిన వారితో రెస్క్యూ ఆపరేషన్ అవసరమైన సందర్భాలలో వినియోగించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిఎం గారితో చింతల శ్రీనివాస్ జిఎం (సేఫ్టీ), ఎస్. ఓ. టు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా రక్షణాధికారి ఎం. వెంకటేశ్వర్లు, డాక్టర్. శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జ్ రెస్క్యూ అనంతరామయ్య, ఇతర రిస్క్యూ సభ్యులు, రెస్క్యూ శిక్షణను పొందుటకు వచ్చిన మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.