calender_icon.png 5 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఘన నివాళి

05-12-2025 12:11:10 AM

కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్, దివంగత  కె. రోశయ్య  వర్ధంతి సందర్భంగా  గురువారం కలెక్టరేట్ లో డి వై ఎస్ ఓ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు  విక్టర్, మదన్ మోహన్‌లు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎం చక్రధర్, కార్యదర్శి సాయిరెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.