calender_icon.png 5 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆర్య వైశ్య నూతన అధ్యక్షుడికి ఘనసన్మానం

05-12-2025 12:12:13 AM

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సిద్ధి శ్రీధర్‌గుప్తాని స్థానిక మాజీ ఎమ్మె ల్యే జాజాల సురేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ప్రజాసేవలో ముందుంటారని వారు ఎల్లప్పుడూ దానధర్మాల్లో వెనకడుగు వేయరని అలాగే వ్యాపార పరంగా ఆర్యవైశ్యులు చాలా ముందంజలో ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అలాగే నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సిద్ది శ్రీధర్ గుప్తా  ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఉన్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు రాచకొండ రవీందర్ రాచకొండ హరిబాబు స్వామి ఆదిమూలం సతీష్ కుమార్ ఇమ్రాన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.