calender_icon.png 17 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివేణి సంగమం.. సో థ్రిల్లింగ్

16-12-2024 12:00:00 AM

కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని అత్యంత అందమైన, పవిత్ర ప్రదేశాలలో ఒకటి. దీన్ని త్రివేణి సంగమం అని కూడా వర్ణిస్తుంటారు చరిత్రకారులు. ఎందుకంటే బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి. విచిత్రమేమిటంటే సముద్రాలలోని నీరు వేరువేరు రంగులలో ఉండటం.. ఆ మూడు సముద్రాల అలలు ఒక దానితో ఒకటి ఢీకొనడం చాలా అరుదుగా కనిపించే దృశ్యమని పర్యాటక ప్రియులు చెబుతారు. 

తమిళ కవి తిరువళ్ళువార్, వివేకానం దా రాక్ అనే ప్రదేశాలు చాలా సుప్రసిద్ధమైనవి. ఇవి రెండూ సముద్రం మధ్యలో ఉంటాయి. ఇక్కడికి పడవ ప్రయాణం ద్వారా వెళ్లాలి. ఈ జర్నీ చాలా థ్రిల్లింగ్‌గా.. ఆనందంగా ఉంటుంది. 

తిరువంతపురం: త్రివేండ్రం అని కూడా పిలువబడే తిరువనంతపురం కన్యాకుమా రి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి సుమారు 2 గంటల సమ యం పడుతుంది. కేరళలోని పురాతనమైన నగరాల్లో ఇదొకటి. ఈ నగరాన్ని ‘మహా త్మా గాంధీజీ ఎవర్‌గ్రీన్ సిటీ ఆఫ్ ఇండి యా’ అని పిలుస్తారు. ఇక్కడికి దగ్గరలో  నేపియర్ మ్యూజియం, కనకకును ప్యాలె స్, కోయికల్ ప్యాలెస్, పుతేన్ మలిగా ప్యాలెస్ మ్యూజియం, పల్కులంగర దేవి ఆలయం, పద్మనాభస్వామి ఆలయం, కుటిరా మాలికలు చూడవచ్చు.  

తూత్తుకుడి: టుటికోరిన్ అని కూడా పిలువబడే ఈ ప్రదేశం కన్యాకుమారి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూత్తుకుడి దక్షిణ భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రం. దీన్ని ‘పెర్ల్ సిటీ’ అని కూడా అంటారు. ఈ నగరం చాలా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. రోచె పార్క్, హార్బర్ బీచ్, ముత్తు నగర్ న్యూ బీచ్, టుటికోరిన్ బే తప్పక చూడాల్సిన ప్రదేశాలు. 

మధురై: కన్యాకుమారి చుట్టూ ఉన్న ప్రసిద్ధ నగరాల్లో మదురై ఒకటి. కన్యాకుమారి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైగై నది ఒడ్డున ఉన్న మదురై నగరం ఎప్పుడు భక్తులతో, పర్యాటకులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ మీనాక్షి అమ్మ న్ ఆలయం, అలగన్ కోయిల్, కూడల్ అజగర్ ఆలయం, తిరుమలై నాయకర్ మహల్, తిరుపారంకున్రం మురుగన్ ఆలయం తప్పక చూడాల్సిందే.