calender_icon.png 16 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రబుల్ షూటర్ సురేందర్‌రెడ్డి!

16-09-2025 12:00:00 AM

  1. పార్టీ వివాదాలు పరిష్కారంలో తమదైన శైలి 

అన్ని డివిజన్ లలో కొలువు తీరుతున్న పార్టీ కార్యాలయలు 

మేయర్ పీఠం రిజర్వేషన్ జనరల్‌వచ్చేఛాన్స్..? 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): పార్టీలో నెలకొన్న ట్రబుల్స్ అన్నింటిని చాకచక్యంగా పరిష్కరిస్తూ ట్రబుల్ షూ టర్ సురేందర్ రెడ్డి నిలిచాడని ఇప్పుడు పార్టీ వర్గాలే చెబుతోన్నా మాట ఇది.. పట్టణ కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత, బహిర్గత వివాదాలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఇ రువురిని తనవైపు ఆకట్టుకోవడంలో ఒక ప్రత్యేక ముద్రను వేసుకొన్నాడు సురేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటేనే..

నిత్యం అంతర్గ పోరుతోపాటు, వారిలో వారే కుమ్ములాడుకోవడం వంటివి చేస్తూ పక్కపార్టీలకు కోవ ర్టుగా పనిచేస్తారనే విమర్శలు తారాస్థాయి లో ఉన్నాయి. ఈ కారణంగా గడచిన పదేళ్ల లో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాతాళంల్లోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పార్టీలో ఉండే నేతలతోపాటు, ముఖ్య కార్యకర్తలంతా పార్టీని వీడి పక్క పార్టీల్లోకి వెళ్లి పోయ్యారు.

కేవలం ఒక్కరు ఇద్దరితో నెట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అసెంబ్లీ ఎన్నిక ల వేళ మంచి రోజులు వచ్చాయి. తమ పార్టీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించడంతో పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చింది. ఆ తరువాత పార్టీని వీడిన వారంతా ఒక్కొక్కరుగా పార్టీల్లోకి రావడం ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి పార్టీలో చే రిన వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తనదైన శైలిలో పంచులు వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకంలేని సమయంలో సురేందర్ రెడ్డి మాటలు ఒక బల మైన నమ్మకాన్ని నింపాయి.

ఆ ఊపుతోనే ఎమ్మెల్యేగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమా ల్ని చక్కబెట్టే బాధ్యతను సురేందర్ రెడ్డి తన బుజాలపై వేసుకొని ఎమ్మెల్యే యెన్నం సహకారంతో ఒక తాటిపైకి తీసుకొచ్చాడని పార్టీ వర్గాలే చెబుతోన్నా మాట ఇది. ఇక నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో.. కాంగ్రెస్ పార్టీలో వివాదాల్లేకుండా మేమంతా ఒకతాటిపైకి తీసుకరావ డంలో సురేందర్ రెడ్డి సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు.

ఇక ఇది వరకు స్పెషల్ గ్రేడ్ గా ఉన్నా పట్టణ మున్సిపాలిటీ ఇప్పుడు విస్తరించి 60డివిజన్లతో అతిపెద్ద కా ర్పోరేషన్గా ఎదిగింది. ఎమ్మెల్యే నియోజకవర్గాన్నికి ధీటుగా మున్సిపల్ కార్పో రేషన్ విస్తరించడంతో మొదటి మేయర్ని తన ఖాతాలో వేసుకొనేందుకు అధికార కాం గ్రెస్ పార్టీ దూకుడుగా పావులు కదుపుతోం ది. అందులో బాగంగానే, మేయర్ అభ్యర్థిగా ఇది వరకే సురేందర్ రెడ్డి పేరును అధికార పార్టీ సూచనప్రాయంగా ప్రకటించడంతో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సి ద్ధం చేసే పనిని వేగవంతం చేసింది.

పట్టణంలోని మొత్తం డివిజన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఏ క్షణమైన నోటిఫికేషన్ రావొచ్చని అందుకు మీరంతా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ క్యాడర్ కు సంకేతాలు జారీ చేసింది. ఇందులో బాగంగానే మేయర్ అభ్యర్థిగా కొ నసాగుతోన్నా సురేందర్ రెడ్డి నిత్యం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రతి పక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తూ, తన రాజకీయ ప్రచార స్పీడును కొనసాగిస్తుండడంతో ఎన్నికల వేడి మొదలైంది.

- జనరల్ కే ఛాన్స్..?

గతసారి బిసీలకు మున్సిపల్ చైర్పర్సన్ లకు అవకాశం రావడంతో ఈ సారి మేయ ర్ రిజర్వేషన్ జనరల్ కు వచ్చే చాన్స్ ఉంద నే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దీం తో బలమైన చురుకైన అభ్యర్థిని నిలబెట్టాలన్నా ఉద్దేశ్యంతో సురేందర్ రెడ్డిని బ రిల్లోకి దింపినట్లు తెలుస్తోంది. ఈసారి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ తమ ఖా తాలో వేసుకుంటుందనే ధీమాలో ఉంది.

నిర్దేశించుకున్నట్టు జనరల్ కేటగిరీలో మహబూబ్ నగర్ నగరం మేయర్ పీఠం దక్కిం చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలు వేసుకుంటూ అడుగులు వేస్తుంది. ఇ ప్పటికే పలు వార్డులలో పార్టీ తమకే కార్పొరేటర్ అవకాశాలు ఇచ్చారని పలువురు ప్ర చారాలు సైతం జరుగుతున్నాయి.

ఈ తరుణంలో ఎవరికివారు కార్పొరేటర్ సీటు మా కంటే మాకు ప్రచారం చేసుకోవడంలో అం దరికీ సముచిత స్థానం కల్పించడంలో ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేర కు మారేపల్లి సురేందర్ రెడ్డి పక్క ప్రణాళికలను రచిస్తున్నాడు. ఎన్నికల కోడ్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఆ సేవలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.