11-07-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, జూలై 10 : నాగల్ గిద్ద మండల పరిధిలోని ముక్టపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన ఆడప అనిల్ టీవీ బహుకరించారు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రమేష్ సాయం అడగగానే అనిల్ స్పందించి టీవీ బహుకరించారు. విద్యాపక్షాన వారికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో మన్మధ కిషోర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, జ్ఞానేశ్వర్, ప్రధాన ఉపాధ్యాయుడు బాబు శెట్టి మండల పిఆర్టియు అధ్యక్షులు శేరీకర్ రమేష్ , సంగమేశ్వర, లింగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.