25-10-2025 07:37:18 PM
నంగునూరు: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇద్దరిని రాజగోపాలపేట పోలీసులు ట్రాక్టర్‌తో సహా అరెస్ట్ చేశారు.మండల పరిధిలోని బద్దిపడగ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ రంగారెడ్డి, పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీల్లో భాగంగా బస్వాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ తాడెం మనోహర్, ట్రాక్టర్ ఓనర్ దండమైన మధు కలిసి, బస్వాపూర్ పెద్ద వాగు నుండి దొంగతనంగా ఇసుకను లోడ్ చేసుకొని సిద్దిపేట వైపు తరలిస్తుండగా పట్టుకొని సుమోటో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివేక్ తెలిపారు. జాన్ డీర్ ట్రాక్టర్ నెం. TS-36 M-4166, ట్రాలీ నెం. TS36 M 4165 లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే, వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.