13-06-2025 01:19:04 AM
మేడ్చల్, జూన్ 12(విజయ క్రాంతి): మే డ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పో లీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ సమీపంలో క్వారీ గుంతలో పడి ఇద్ద రు చిన్నారులు మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం అరుంధతి నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం (8) బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు గురువారం ఉదయం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం గుంతలో మృతదేహాలు పైకి తేలాయి. పోలీసులు మృతదేహా లను పైకి తీయించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.