04-01-2026 12:18:29 AM
ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండు డీఏలను ప్రకటించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. శాసనమండలిలో స్పెషల్ మెన్షన్స్‌లో భాగంగా ప్రభుత్వం దృష్టికి డీఏల అంశాన్ని తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో గతంలో ప్రభుత్వం రెండు డీఏలను ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక డీఏను విడుదల చేసి మరో డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని డిసెంబర్ వరకు గడువు విధించిందని, కానీ ఇంతవరకూ దాని ఊసేలేదన్నారు. జనవరి నెల రావడంతో మరోక కొత్త డీఏ కూడా వచ్చి చేరడంతో కొత్తగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటాయన్నారు. ప్రభుత్వం రెండు డీఏలను ప్రకటించాలని ఆయన కోరారు.