04-01-2026 12:16:19 AM
ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్
ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు ప్రత్యేక చట్టం తేవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సంఖ్యా పరంగా అధికంగా ఉన్నప్పటికీ వారి పై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి బీసీల పరిరక్షణకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల చట్టం తరహాలో ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాం డ్ చేశారు. ముఖ్యంగా సంచార జాతులకు చెందిన బీసీ ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతో, రక్షణ లేకుండా బాధ పడుతున్నా యని అలాగే రానున్న జెడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మాట మార్చిన సీఎం ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో పేర్కొనడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుటూ బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అత్యవసరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ కుమార్, రాందేవ్ మోడీ, గంగాపురం పద్మ, చిక్కుడు బాల య్య తదితరులు పాల్గొన్నారు.