calender_icon.png 2 January, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి

02-01-2026 01:28:44 AM

బండ్లగూడ జాగిర్ జనవరి 1 (విజయ క్రాంతి) : నిర్లక్ష్యం, అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొన్నది. బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై యువతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతు న్నారు. రామంతపూర్‌కు చెందిన కావ్య (20) హిమాయత్ నగర్ శ్రీ చైతన్య డీమ్డ్ కాలేజ్‌లో బీసీఏ 3వ సంవత్సరం చదువుతోంది.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కావ్య తన కళాశాల స్నేహితుడు టి. కౌశిక్‌రెడ్డి బైకుపై వస్తుండగా కౌశిక్ రెడ్డి అజీజ్ నగర్ నుంచి కాలీమందిర్ వెళ్లే రహదారిపై అతివేగంగా జాగ్రత్తగా బైకును నడుపుతూ టిజిపిఎ సమీపంలోని నవనామి మాగెలియో కన్స్ట్రక్షన్ సైట్ వద్ద,  నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఎ పి 39 యు డబ్ల్యూ 2654 నంబరు గల డీసీఎం వాహనాన్ని వెంక నుండి ఢీకొన్నాడు.

బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కావ్య సంఘ టన స్థలంలోనే మృతి చెందగా, కౌశిక్ రెడ్డి తీవ్ర రక్త గాయాల పాలయ్యాడు. గాయపడిన కౌశిక్ రెడ్డిని చికిత్స నిమిత్తం రెనోవా హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతురాలి సోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుకున్నట్లు నార్సింగి ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు..