calender_icon.png 8 August, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు గుండ్లహారం దొంగల అరెస్ట్

07-08-2025 12:07:12 AM

నిందితులు భార్య,భర్తలు దొంగిలించిన సొత్తు రికవరీ

తలకొండపల్లి,ఆగస్ట్ 06: గుడి దగ్గర కుర్చుని వున్న వృద్దురాలికి మాయమాటలు చెప్పి బాంగారు గుండ్ల హారం దొంగిలించిన దొంగలను మంగళవారం అరెస్ట్ చేసినట్లు తలకొండపల్లి ఎస్త్స్ర శ్రీకాంత్ తెలిపారు.చోరికి సంబందించి ఎస్త్స్ర చెప్పిన వివరాలు ఇలావున్నాయి.తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన రాచమల్ల మల్లమ్మ అనే వృద్దురాలు గత నెల 30 వ తేదినాడు గ్రామంలోని సాయిబాబ గుడి వద్ద కుర్చుని ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి వృద్దురాలితో మాట కలిపారు.

మాది ఆవంచ గ్రామం మేము మీకు చుట్టాలం అవుతామని మాయమాటలు చెప్పారు.వృద్దురాలి మెడలో ఉన్న 9 గ్రాముల బంగారు గుండ్లహారం తీసుకుని పుస్తెల తాడు ఆమే చేతిలో పెట్టి వెళ్లిపోయారు.పుస్తెల తాడును వృద్దురాలు ఆమే మనవడికి చుపించగా అది నఖిలీదని తేలగా వెంటనే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్త్స్ర శ్రీకాంత్ వివరించారు.కేసును సవాలుగా తీసుకున్న ఎస్త్స్ర శ్రీకాంత్ క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ జాషువాకు కేసు అప్పగించారు.

జాషువా చోరీ జరిగిన స్తలానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రతి సిసి కెమరాలను పరిశీలించారు.నిందితులు మిడ్జిల్ మండల కేంద్రంలోని బంగారు షాపులో గుండ్లను అమ్మినట్లు గుర్తించారు.అక్కడికి వెళ్లి గుండ్లను స్వాదీనం చేసుకుని దొంగల కోసం వెతుకడం ప్రారంభించారు.ఈ క్రమంలో శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాకారంతో దొంగలను పట్టుకున్నారు.

వారిని విచారించగా ఇద్దరు భార్య భర్తలు ఎరుకలి శ్రీను,ఎరుకలి అరుణ గా గుర్తించారు.వీరిపై గతంలో కూడా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్త్స్ర శ్రీకాంత్ వివరించారు.కేసు చేదనలో చాకచక్యంగా వ్యవరించిన క్రైం కానిస్టేబుల్ జాషువాను ఎస్త్స్ర గ్రామస్తులు అభినందించారు.