18-11-2025 12:00:00 AM
ధర్మపురి,నవంబర్ 1౭ (విజయక్రాంతి): వెల్గటూర్ మండల ఎస్ ఐగా పి.ఉదయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. శాంతి భద్రతల విషయంలో మండలప్రజలు పోలీసుశాఖకు సహకరించాలినీ ఆయ న కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోటిలింగాల దేవస్థానాన్ని ఆయన సం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పూదరి రమేష్, ఈవో కాంతరెడ్డి, డైరెక్టర్ గుమ్ముల వెంకటేష్ లు ఆయనకు స్వాగతం పలికారు.ఉదయ్ కుమార్ ను వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాద వ్, గాజుల విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలుతెలిపారు.