14-05-2025 12:00:00 AM
తాంసీ, మే 13 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ సబ్ మార్కెట్ యార్డ్ లో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చిన 136 క్వింటాళ్ల జొన్నలను అధికారులు సీజ్ చేశారు. మంగళవారం మార్కెట్ యార్డులో గుర్తు తెలియని వ్యక్తులు 272 జొన్నల బ్యాగ్ లను తీసుకువచ్చారని స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు.
దింతో సెంటర్ ఇన్ఛార్జ్, సీఈఓ కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. దింతో సీఈఓ తో పాటు మండల వ్యవసాయ అధికారి రవీందర్, ఎస్‌ఐ దివ్యభారతిలు మార్కెట్ యార్డ్‌కు వెళ్లి విచారణ చేపట్టారు.
172 జొన్నల బ్యాగుల విషయంలో రైతులెవరూ ముందు కు రాకపోవడంతో బైట నుండి వచ్చిన జొన్నలుగా గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సెంటర్ ఇన్చార్జ్ కేశవ్ తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ యార్డ్ కు వచ్చిన ఈ జొన్నల బ్యాగులు ఎవరివి అనే విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు