09-08-2025 01:11:13 AM
- నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బహిరంగ దందా
- అనుమతులు లేకుండా సెల్లార్ పనులు, మట్టి విక్రయాలు
- మన్సూరాబాద్ డివిజన్ ఆటో నగర్ లో నిర్మాణ పనులు
- మైనింగ్ శాఖకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు
-కండ్లు మూసుకున్న మైనింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు
ఎల్బీనగర్, అగస్టు 8 : అనుమతులు తీసుకోకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టి, బ హిరంగంగా మట్టి విక్రయాలు కొనసాగుతున్నా మైనింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించడం లేదు. భారీ నిర్మాణాలకు పే రొందిన నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రభు త్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద భవ న నిర్మాణాలు చేపడుతోంది. మైనింగ్ శాఖ కు భారీస్థాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నా.. అధికారులు ఇచ్చిన నోటీసులను బే ఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు పలుచోట్ల భారీగా భవన ని ర్మాణాలు చేపట్టినా ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. ఇదే విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టిపటనట్లు వ్యవహరిస్తుండడంతో అనుమానాలకు తా విస్తోంది. నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తవ్వకాల్లో వచ్చిన రాళ్లు, మట్టిని బహిరంగంగా యథేచ్చగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో నిబంధనలు పాటించకుండా నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ భారీ నిర్మాణాలు చేపడుతుంది.
మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ పార్కింగ్ ప్రాంతం సర్వే నంబర్ 38లో నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మట్టి మాఫియాకు తెరలేపింది. అర్ధరాత్రి తవ్వకాలు చేప డుతూ తెల్లవారే లోపు వందల కొద్ది టిప్పర్లతో మట్టిని అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం సమయంలో అయితే అధికారులకి తెలిస్తే ఇబ్బందులకు గురి చేస్తారని అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొడుతున్నారు. గతంలో కూ డా ఇదే ప్రదేశంలో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేయటంతో మైనింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేసి, జరిమానా విధించినా మళ్లీ అదే పనిగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిమానా చెల్లించలేదు.
అధికారుల నోటీసులు.. స్పందించని కంపెనీ
ఆటోనగర్ పార్కింగ్ ప్రాంతంలో జరుగుతున్న నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అక్రమ తవ్వకాలపై ఇటీవల మైనింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇటీవల వనస్థలిపు రం పోలీసులు మట్టి తవ్వకాల వద్దకు వెళ్లి టిప్పర్ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, మైనిం గ్ అధికారులు సైతం నోటీసులు జారీ చేసి నా నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యాజమా న్యం స్పందించడం లేదు. రెవెన్యూ అధికారులు స్వయంగా పనులు చేపట్టే స్థలానికి వ చ్చి విచారణ చేపట్టినా కంపెనీ ప్రతినిధులు సమాధానం ఇవ్వడం లేదు.
తవ్వకాల్లో బ్లాస్టింగ్స్.. భారీ శబ్దాలు
సమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. భవన నిర్మాణ స్థలంలో రాళ్లను తొలిగించడానికి బ్లాస్టింగ్స్ చేస్తూ తవ్వకాలు చేపడుతు న్నారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చే భారీ శబ్దాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెల్లార్ పనుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రాత్రింబవళ్లు పనులు కొనసాగించా రు. విపరీతంగా బ్లాస్టింగ్స్ చేపట్టి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
- పట్టించుకోని అధికారులు..
పనులు జరుగుతున్న చోటుకు అధికారు లు వెళ్లి ఆరా తీయగా, తామ హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందామని దబాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యం గా ఎస్వో టీం, ట్రాఫిక్, మైనింగ్, జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులు ఇటువైపు కూ డా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బండ రాళ్లు, మట్టిని విక్ర యిస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. అధికారుల అలసత్వంతో జరగరాని ప్రమాదం ఏదైనా చోటుచేసుకుంటే నష్టం పెద్ద ఎత్తున జరుగుతుందని స్థానిక ప్ర జలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఉ న్నతాధికారులు పట్టించుకుని మన్సూరాబాద్ లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అరికట్టాలని, పర్మిషన్లు లేకుండా తవ్వకాలు జరుపుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- ప్రజావాణిలో నమిశ్రీ ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీపై ఫిర్యాదు
అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న నమిశ్రీ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీపై కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. నమిశ్రీ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ ఆటోనగర్ లో చేపట్టిన డెవలప్మెంట్ స్థలంలో రాత్రికి రాత్రే అనుమతులు లేకుం డా మట్టిని తవ్వి, తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి అనుమతులు లేకుండా మైనింగ్ పాల్పడుతున్న నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.