calender_icon.png 9 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్‌షాక్‌తో యువరైతు మృతి

09-08-2025 01:08:10 AM

తాండూరు, 8 ఆగస్టు, (విజయక్రాంతి) కరెంట్ షాక్ తో యువరైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయి పేట గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.... గ్రామానికి చెందిన పాలేపల్లి రమేష్ (38) తన పది గుంటల వ్యవసాయ భూ మిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపా ధి కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వరి పొలానికి నీళ్లు పారిం చేందుకు పొలానికి వెళ్లి సర్వీస్ వైరు తెగి పడడంతో సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతాం అక్కడికక్కడే మృతి చెందాడు . చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో గ్రామస్తులతో కలివిడిగా ఉండే రమేష్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలుఅలుముకున్నాయి. కుటుం బ పెద్ద రమేష్ మృతితో అతడి భార్య గౌర మ్మ,, కొడుకు ప్రదీప్, కుమార్తె శ్రీజ అ నాధ లయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.