calender_icon.png 21 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్-17 చాంపియన్స్ భారత్

01-10-2024 12:00:00 AM

ఫైనల్లో బంగ్లాపై విజయం

థింపూ: భూటాన్ వేదికగా జరిగిన సాఫ్ అండర్-17 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్ విజేతగా భారత్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 2-0 తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున మొహమ్మద్ కైఫ్ (ఆట 58వ నిమిషంలో),  నజ్ముల్ హుడా (90+5వ ని.లో) రెండు గోల్స్ సాధించారు. ఈ విజయంతో ఆరోసారి సాఫ్ అండర్-17 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్..

వరుసగా మూడో ఏడాది (2022, 2023, 2024) హ్యాట్రిక్ టైటిల్‌ను నెగ్గడం విశేషం. తొలి హాఫ్‌లో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో అర్థభాగంలో 58వ నిమిషంలో కైఫ్ హెడర్ గోల్‌తో భారత్ ఖాతాను తెరిచాడు. అదనపు సమయంలో నజ్ముల్ గోల్‌తో మెరవడంతో భారత్ 2 ఆధిక్యంలో నిలిచింది.