calender_icon.png 14 January, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిపైకి కూలిపోతున్నా..

14-01-2026 01:53:11 AM

‘పీఎస్‌ఎల్‌వీ 62’ ప్రయోగంలో అన్యూహ ఘటన

మూడో దశ విఫలమైన తర్వాత రాకెట్‌ను వీడిన స్పానిష్ ఉపగ్రహం

శ్రీహరికోట, జనవరి ౧౩: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీసీ 62 రాకెట్ ప్రయోగానికి మూడో దశలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. రాకెట్ కిందికి కూలిపోతున్న సమయంలో మొత్తం 1౬ ఉపగ్రహాలు సముద్రంలో కూలిపోయాయని ఇస్రో భావించింది. కానీ.. ఇక్కడే ఒక ట్విస్ట్. స్పానిష్ స్టార్టప్ సంస్థ ‘ఆర్బిటల్ పారాడిగ్స్’ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన ఉపగ్రహానికి  సంబంధించిన క్యాప్సూల్ అంతరిక్షం నుంచి దాదాపు 3 నిమిషాల పాటు డేటాను విజయవంతంగా పంపిందని స్పష్టం చేసింది. ఈ విషయం చరిత్రలో మైలురాయిగా నిలిచింది.