24-05-2025 12:43:55 AM
-సామాన్యులకు మరో తీరు
-ఓకే గల్లీలో పార్సియాల్టీ చూపిన మున్సిపల్ అధికారులు
-రోడ్డులో ఆక్రమించారని ఒక చోట తొలగించారు
-మరోచోట తొలగించేందుకు జంకుతున్నారు
-ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా ?
-ఇది కామారెడ్డి బల్దియా అధికారుల తీరు
కామారెడ్డి, మే 23 (విజయ క్రాంతి),; బడా బాబుల ఒక రూలు, సామాన్యులకు మరో రూలు, ఇది కామారెడ్డి బల్దియా అధికారుల తీరుకు నిదర్శనం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఉన్న వార్డులో ఒకవైపు రైల్వే స్టేషన్ కోర్టు రోడ్డులో మున్సిపల్ రోడ్డ ను ఆక్రమించి ఏలాంటి అనుమతులు తీసుకోకుండా అప్పటి మున్సిపల్ పాలకవర్గం అండదండలతో ఓ బడా బాబు మున్సిపల్ నిబంధనలను తుంగ లో తొక్కి స్థానికులు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.
ఎన్నారై కావడంతో తనకు ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడమే కాకుండా వారికి ఫారెన్ మందు ఇచ్చి డబ్బులు అడిగి నన్ని ఇచ్చి ఓ బడా లీడర్ ఆశీస్సులతో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అడ్డు అదుపు ఎవరు ఉండరని తనకు అందరి అండదండలు ఉన్నాయని అహంకారంతో మున్సిపల్ స్థలంలో స్థానికులు వర్షం పడితే రోడ్డుపై మురికి నీరు చేరుతుందని తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మున్సిపల్ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు.
ప్రస్తుత ప్రభుత్వం కు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా లెక్క చేయకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అని దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందిగా మారిన వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు కు కు జారీ చేశారు.
వెంటనే గత రెండు రోజుల క్రితం తెల్లవారుజామున పోక్లైనర్ తెచ్చిరోడ్డు రోడ్డుకు అడ్డంగా ఉన్న మురికి కాలువలపై నిర్మించిన వాటిని అంతవరకు బాగానే ఉన్నా ఇదే కాలనీలో నిజాం సార్ చౌరస్తాలో ఓ బడా బాబుకు చెందిన బట్టల దుకాణాలు రెండు ఇబ్బందులతోపాటు మున్సిపల్ స్థలాల్లోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఏసి మిషన్లు అమర్చి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు అప్పటి అసిస్టెంట్ కలెక్టర్ నందులాల్ అక్రమంగా నిర్మించిన భవనాన్ని పై అంతస్తులను సీజ్ సీజను ఎవరికి చెప్ప పెట్టకుండానే ఆ బడా బాబు వ్యాపారి తన అనుచరులతో అసిస్టెంట్ కలెక్టర్ వేసిన సిల్ ను తొలగించారు.
దాంతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మున్సిపల్ స్థానాల్లోనే అమర్చడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నా యి. చౌరస్తా కావడంతో బస్సులు, కారులు , ద్విచక్ర వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. బల్లి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులు సైతం పట్టించుకోకపోవడంతో నిత్యం నిజాంసాగర్ చౌరస్తాలో ఆర్టీసీ డ్రైవర్లతోపాటు ప్రైవేటు వాహనాల వారు ట్రాఫిక్ ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చేస్తున్నారు.
పలుకుబడి ఉన్నవారికి ఒక తీరు పలుకుబడి లేని వారికి మారుతీరుల వ్యవహరిస్తున్నార అనడానికి మున్సిపల్ అధికారులు చేసిన రోడ్డు వెడ ల్పు పేరుతో ఒకే కాలంలో ఓకే ప్రాంతంలో రెండు వేరు వేరు దారులలో మున్సిపల్ అధికారులు కోర్టు రోడ్డులో ఉన్న మధ్యతరగతి వారికి సంబంధించిన మురికి కాలువలపై గోడలు నిర్మించుకున్న వాటిని గత రెం డు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వారికి చెప్పా పెట్టకుండానే నోటీసులు ఇవ్వకుండా నే తొలగించారు.
కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా లోని బడా వ్యాపారులకు సంబంధించిన వస్త్ర వ్యాపారం కొనసాగుతున్న అనధికారికంగా నిబంధనలకు విరు ద్ధంగా నిర్మించిన భవన అంతస్తులతో పాటు మురికి కాల్వలను కబ్జా చేసి వాటిపై ఏసీ మిషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ట్రాఫి క్కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్నచోట వాటిపై చర్యలు తీసుకోకుండా అడ్డంగా ఉన్న వాటి ని తొలగించకుండా సామాన్యుల్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం మున్సిపల్ అధికారులు తెల్లవారుజామునే వారికి చెప్పా పెట్టకుండానే కబ్జా స్థలాలను చ తొలగించారు.
బడా వ్యాపారులకు చెందిన వాటిని మాత్రం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోవడం లేదు. బడ వ్యాపారుల నుంచి మామూళ్లకు అలవాటు పడి ఫిర్యాదులు వచ్చిన వాటిని బుట్ట దాఖలు చేస్తూ చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పిన పట్టించుకోవడం లేదు.
ఓకే కాలనీలో ఓకే తీరు వ్యవహరించాల్సిన మున్సిపల్ అధికారులు సామాన్యుల ఒక తీరు బడా బాబులకు మరో తీరుగా వ్యవహరిస్తూ ప్రజల చులకనగా బల్దియ అధికారుల్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ నవ్వుకుంటున్నారు. ఏదిఏమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసిన చోట వాటిని తొలగించి ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇప్పటి కైనా చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు.
మున్సిపల్ స్థలాలు కబ్జాలు చేస్తే చర్యలు తీసుకుంటాం..
మున్సిపల్ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని పరిశీలించి మున్సిపల్ స్థలాలకు కబ్జాకు గురైతే ప్రోక్లైన్ పెట్టి భవనాలైన రోడ్లైన తొలగిస్తామని తెలిపారు. గతంలో పని చేసిన వారు నిర్లక్ష్యం చేయవచ్చు కానీ తాము పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాజేందర్ రెడ్డి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు.
రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి