06-01-2026 05:33:04 PM
చిట్యాల,(విజయక్రాంతి): ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. రావుల కృష్ణ రాష్ట్ర స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ కో కన్వీనర్ గా కొంపల్లి సూర్యను మంగళవారం నియమించారు. ఈ నెల 3,4,5 తేదీలలో శంషాబాద్ లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు డా.రావుల కృష్ణ నూతన కార్యవర్గంను ప్రకటించగా చిట్యాల పట్టణ వాసికి కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ కో కన్వీనర్ గా కొంపల్లి సూర్యను నియమించారు. కొంపల్లి సూర్య ప్రస్తుతం మహత్మ గాంధీ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్నారు. గతంలో కొంపల్లి సూర్య ఏబీవీపీ చిట్యాల పట్టణ కార్యదర్శిగా, మహత్మా గాంధీ యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ సందర్భంగా కొంపల్లి సూర్య మాట్లాడుతూ తన పై నమ్మకంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అయిన ఏబీవీపీ లో రాష్ట్ర స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ కో కన్వీనర్ గా నియమించి రాష్ట్ర అధ్యక్షుడు డా. రావుల కృష్ణ కి మరియు రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో మరియు విద్యార్థులలో జాతీయవాదం పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వీరికి అభినందనలు తెలిపారు.