శభాష్ రా తల్లి!

30-04-2024 12:10:00 AM

ఏప్రిల్ నెల మొదటి వారంలో సోషల్ మీడియాలో ప్రాచీ నిగమ్ అనే అమ్మాయి విపరీతంగా ట్రోలింగ్ కి గురైంది. ఉత్తర ప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు తెచ్చుకుంది ప్రాచీ. 600 మార్కులకుగాను 591 మార్కులు సాధించింది. ఆమె ఫోటోలు అన్ని పేపర్లలోనూ పడ్డాయి. మామూలుగా అయితే ఎవ్వరైనా ఆ ప్రతిభని గుర్తించి మెచ్చుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రాచీ మాత్రం హేళనలకు గురైంది. కారణం ఏమిటంటే ఆమె మొహం మీద ఉన్న అవాంఛిత రోమాలు.

ప్రాచీ చూడడానికి అబ్బాయిలా ఉందని, గడ్డాలు, మీసాలు ఉన్నాయి, ఇంతకీ ఈమె అమ్మాయా అబ్బాయా? అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ అందానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది, ప్రతిభకు కాదు. “బాగా చదివి ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. నా దృష్టి నా మార్కుల మీద తప్ప నా ముఖం మీద వెంట్రుకల మీద కాదు” అని ఒక్క మాటతో తేల్చి పడేసింది. చాలావరకూ హార్మోన్ల అసమ తుల్యత వల్ల ఇలా ఆడపిల్లల్లో మీసాలు, గడ్డాలు వస్తాయి. ఈ సమస్య ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. అలాగే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఓవెరియన్ డిజార్డర్) అనే సమస్య వల్ల కూడా  రావచ్చు.   అందుకే అన్ వాంటెడ్ హెయిర్ అనగానే వాటిని తొలగించటం ఎలా? అని ఆలోచనతో పాటే ఒకసారి డాక్టర్‌ని కలవటం చాలా మంచిది. కేవలం హెయిర్ తొలగించు కుంటూ ఉంటే అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది. చాలామంది మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ ఇలా వాడటం ప్రమాదకరం. అన్ని చర్మాలూ ఒకలా ఉండవు, మన చర్మానికి ఏ క్రీమ్ సూటవుతుందో తెలుసుకున్నాకే వాడాలి. అందుకే ఇలా వాడేముందు కాస్మొటాలజిస్ట్‌ని సంప్ర దించి ఎలాంటి క్రీమ్ మనకి సరిప డుతుందో తెలుసుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా లేనప్పుడు ఇంటిదగ్గరే చిన్న చిన్న ఫేస్ ప్యాక్‌లతో, చిట్కాలతో ఈ అన్ వాంటెడ్ హెయిర్ ని తగ్గించుకోవచ్చు. 

పాలు, పటిక పొడి పేస్ట్: ఒక చిన్న కప్‌లో రెండు టేబుల్ స్పూన్‌ల పాలు తీసుకోవాలి, ఇందులో చిటికెడు పటిక పొడి కలపాలి. ఇందులోకి రెండు స్పూన్‌ల బేకింగ్ సోడా వేసి పేస్ట్ లాగా కలపాలి. దీన్ని ముఖం మీద అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో పట్టించి 15 నుండి 20నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత సాధారణ నీటితో ముఖం కడిగేయాలి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పేస్ట్ వెంట్రుకల పెరుగుదలను అరికడుతుంది.

అయితే అందరు ఆడపిల్లలకీ ప్రాచీ నిగమ్ కి ఉన్నంత ధైర్యం, బలమైన మనస్తత్వం ఉండక పోవచ్చు, ‘అందంగా లేవు‘ అనే మాట వాళ్ల ఆత్మస్థైర్యాన్ని తగ్గించ వచ్చు. ఇంతకీ ఆడపిల్లల్లో ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ఎలా తగ్గించుకోవాలి? బ్యూటీ పార్లర్ కి వెళ్లేంత సమయమూ, డబ్బూ లేనివాళ్లకి సులభంగా ఈ ముఖం మీద వచ్చే వెంట్రుకలని తొలగించు కోవటానికి ఇంట్లోనే చేసుకునే కొన్ని చిట్కాలని చెబుతున్నారు. 

 బొలిశెట్టి, కాస్మొటాలజిస్ట్


శెనగ పిండి స్క్రబ్: నాలుగు స్పూన్ల శెనగ పిండికి కాస్త పెరుగును జోడించాలి. దీనిలో కాస్త లావెండర్ నూనె లేదా బాదం నూనెను చేర్చాలి. అన్నింటిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కొద్దిగా నలుగు పెట్టినట్లుగా చేసి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లాగా  పని చేస్తుంది. ఇలా క్రమంగా చేయడం వల్ల శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు మాయం అవుతాయి.          



అల్విదా