30-09-2025 12:00:00 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అ రాక్షసుడిని వధించి విజయం పొందిన సందర్భంగా 10 వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండగ జరుపుకోవడం మన సాంప్రదాయ సంస్కృతి లో భాగంగా జరుగుతోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. దుర్గ దేవి విజయానికి గుర్తుగా ప్రజలంతా దేవి నవరాత్రులను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ ఒక్కో రోజు, ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రతేకం అన్నారు.