30-12-2025 12:00:00 AM
గందరగోళంగా యూరియా పంపిణీ
ఎరువుల కార్డులు నిరుపయోగం
పనిచేయని యాప్
రైతుబంధు డేటా ఆధారంగా యూరియా పంపిణీ
మానుకోట జిల్లాలో మళ్లీ మొదలైన యూరియా కష్టాలు
మహబూబాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ యూరియా పంపిణీలో పారదర్శకతో పాటు రైతులకు ఇబ్బందులు తొలగించి, సక్రమంగా యూరి యా అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన తొలిరోజే సర్వర్ డౌన్ అయి రైతులను తెగ తిప్పలు పెట్టింది. సోమవారం నుండి రైతులకు యాప్ ద్వారా యూరియా పంపి ణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులకు నూతన యాప్ వినియోగంపై అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనితో రైతు వేదికల వద్దకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కొందరు స్మార్ట్ఫోన్ ఉన్న రైతులతో పాటు ఆధార్ బేస్ లింకు ఉన్న సాధారణ మొబైల్ ఫోన్లతో అవగాహన కార్యక్రమానికి వచ్చారు. అయితే యాప్ సర్వర్ డౌన్ అయి ‘ఎర్రర్’ చూపించడంతో అధికారులు చాలా చోట్ల యాప్ వినియోగంపై రైతులకు ప్రత్యక్ష పద్ధతిలో చూపించే పరిస్థితి లేకుండా పో యింది. దీనికి తోడు సోమవారం పలుచోట్ల యూరియా కోసం రైతులు ప్రైవేట్ ఎరువుల షాపుల ముందు, సొసైటీల వద్దకు చేరుకున్నారు. ఉదయం పూట కొంతమంది రైతు లకు యాప్ ఓపెన్ కావడంతో సమీప ఎరువుల షాపు లో స్టాకు ఉండడం చూసి బుక్ చేసుకున్నారు.
కొందరు రైతులు సోమవా రం యూరియా కోసం ఎరువుల షాపు వద్దకు రాగా డీలర్ లెవెల్ లో సేల్ ప్రొసీజర్ నమోదు చేయడానికి యాప్ పనిచేయకపోవడంతో యూరియా పంపిణీకి బ్రేక్ పడిం ది. సాయంత్రం వరకు అదే పరిస్థితి కొనసాగడంతో డీలర్లు యూరియా బుక్ చేసుకున్న కొద్దిమంది రైతులకు కూడా యూరియా ఇవ్వలేకపోయారు. యూరియా యాప్ పొ ద్దంతా పనిచేయకపోవడంతో ఈ విషయా న్ని వెంటనే జిల్లా అధికారులకు సమా చారం ఇవ్వడంతో గత వానాకాలం సీజన్లో యూరియా పంపిణీ కోసం రైతుబంధు డే టాబేస్ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. పూ ర్తిస్థాయిలో యాప్ పనిచేసిన తర్వాత యధావిధిగా రైతులకు యూరియా యాప్ ఆధారంగానే పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. మొత్తంగా మొదటి రో జు యూరియా యాప్ రైతులకు నిరాశ చెందేలా చేసింది.
ఎరువుల కార్డులు నిష్ప్రయోజనం.?
మహబూబాబాద్ జిల్లాలో సుమారు 1.80 లక్షలకు పైగా రైతులు ఉండగా, యాసంగి, వానకాలం కలిపి 4.55 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా పథకం అమలుకు విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వడానికి నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి తోడు ఇటీవల వ్యవసాయ శాఖ ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేకంగా కార్డులను ముద్రించింది. చాలాచోట్ల రైతులకు ఆ కార్డులను పంపిణీ కూడా చేశారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ నూతనంగా ఆ కార్డులను పక్కనపెట్టి యాప్ విధానం ప్రవేశపెట్టింది.
అయితే ఏ విధానాన్ని పూర్తిగా అమలు చేయకుండా మధ్యలో వదిలేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగుకు అవసరమైన యూరియా పంపిణీకి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ డి మాండ్ చేస్తున్నారు. యాప్ పని చేయని పక్షంలో ప్రత్యామ్నాయ విధానాలను అమ లు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నారు. కేవలం యాప్ ను నమ్ముకుంటే ఇబ్బంది తప్పదని రైతులు పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో ఇదే పరిస్థితి తలెత్తి సక్రమంగా యూరియా పంపిణీ చేయకపో వడంతో పంటలు దెబ్బతిన్నాయని, ఆశించిన దిగుబడి రాలేదని, ఇప్పుడు నూతన విధానం పేరుతో రకరకాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల ఇప్పుడు కూడా యూరియా కోసం ఇబ్బందులు పడా ల్సి వస్తుందని, తక్షణం అధికారులు స్పందించి ఏదో ఒక నిర్ణయం ప్రకటించి రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలంటూ ఇనుగుర్తిలో రైతులు అధికారులను డిమాండ్ చేశారు.
స్పందించని అధికారులు
యూరియా యాప్ పనిచేయకపోవడం, యూరియా ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి రైతులతో పాటు డీలర్లు అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరు కూడా స్పందించలేదు. చివరకు ఈ విషయంపై మీడియా ప్రతినిధులు కూ డా వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేస్తే నో రిప్లై రావడం విశేషం. కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా వ్యవసాయ శాఖ అధికారుల తీరు మారింది.