calender_icon.png 22 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగ్రత్తలతోనే వ్యాధులు దూరం

22-08-2025 12:54:07 AM

  1. వ్యక్తి గత పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ నాయక్ 

మిడ్జిల్ ఆగస్ట్ 21 : సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలతోనే వాటికి దూరంగా ఉండాలని వైద్యులు అన్నారు గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేయడం తో పాటు సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్ శివకాంత్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధుల కాలంలో టైఫాయిడ్ మలేరియా వంటి వ్యాధులు సోకినప్పుడు తీసుకునే ఆహారం విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ నాయక్ సూచించారు, మండలంలోని చిల్వేర్ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు శిబిరంలో రోగులకు డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు, శిబిరంలో జ్వరం, కోల్డ్, దగ్గు, నొప్పులు, షుగర్, బిపి, పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చారు,

క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి శాంపిల్స్ 30 మందిని సేకరించారు, అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్ విద్యను నరేష్ హెల్త్ అసిస్టెంట్ దేవయ్య జంగయ్య సంపత్ కుమార్ ఏఎన్‌ఎంలు శ్రీదేవి, జ్యోతి, నీలమ్మ, ఆశా కార్యకర్తలు చంద్రకళ, కవిత, స్వప్న, సంతోష తదితరులు పాల్గొన్నారు.