calender_icon.png 13 May, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ బైడెన్‌దే అమెరికా అధ్యక్ష పీఠం!

03-05-2024 12:51:33 AM

ప్రొఫెసర్ అలన్ లిచ్‌మన్ సర్వేలో వెల్లడి

మే 2, విజయక్రాంతి: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునేది ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలను ఖచ్చితత్వంతో అంచనా వేయడంలో దిట్టగా పేరొందిన పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ అలన్ లిచ్‌మన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తన అంచనాలను విడుదల చేశారు. 13కీ ప్రశ్నల ద్వారా అభ్యర్థుల జయాపజయాలను అంచనా వేశారు. ప్రొఫెసర్ అలన్ లిచ్‌మన్ 1984 నుంచి అమెరికా అధ్యక్ష ఫలితాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 10 అధ్యక్ష ఎన్నికలను అంచనా వేయగా.. 9 ఎన్నికల్లో అంచనాలు నిజమయ్యాయి.