23-10-2025 08:16:18 PM
ప్రాణం పోయినా సరే ట్రాక్టర్ ఇవ్వాలి
అటవీ శాఖ అధికారి బాబాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఫారెస్ట్ అధికారి బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన కాట్రాతు సుభాష్ ను సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పరామర్శించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో సుభాష్ ను పరామర్శించిన అనంతరం సుభాష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దీనికి బాధ్యుడైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకునేంతవరకు మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులుగా ఉన్నటువంటి బాబా, కాట్రోత్ సుభాష్ రాజంపేట మండలం జోగ్రం గుట్ట తండాకు చెందిన గిరిజన రైతులను గత కొంతకాలంగా డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో పలుమార్లు తప్పుడు కేసులు పెట్టించి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ కోర్ట్ ఆర్డర్లు ఉన్నప్పటికీ మీ కొట్టు తో మాకు సంబంధం లేదని పాత కేసులుy ఉన్నాయని ఇసుక ట్రాక్టర్ ఇస్తావా డబ్బులు ఇస్తావని బెదిరించిన ఇవ్వకపోవడంతో దీనిపైన ఏమీ అవగాహన లేని రాజంపేట ఎస్సై పోలీసులతో చేరుకొని ఓ స్మగ్లర్ రౌడీ షీట్లను ట్రీట్ చేసినట్టు ఇంటి చుట్టూ తిరుగుతూ గల్ల పట్టి తీసుకొచ్చి అందరి ముందు అవమానకరంగా ప్రవర్తించి చస్తే చావు మాకేం లేని బెదిరించడం జరిగింది. భరించలేని కాట్రోత్ సుభాష్ వెంటనే పురుగుల మందు తాగి పడిపోయినప్పటికీ ఈ ప్రాణం పోతే మాకేంది నువ్వు కావాలి ట్రాక్టర్ కావాలి అని వేధించి మూర్ఖంగా ప్రవర్తించిన అటవీశాఖ అధికారి బాబా పై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చర్యలు తీసుకోవాలి వారు కోరారు.