calender_icon.png 23 July, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

23-07-2025 01:18:33 AM

జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లెపు శివకుమార్

ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): అన్ని రంగాలలో వెనుకబడి అభివృద్ధి అమడ దూరంలో ఉన్న వడ్డెరులను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని జాతీయ వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులుగా నూతనం గా నియమితులైన వల్లెపు శివ కుమా ర్‌ను గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్న వడ్డెరుల జీవితాలు మాత్రం మారలేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరులను గుర్తించి అధుకోవాలన్నారు. అదే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరులకు మైనింగ్ లో 20శాతం ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పనుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పిస్తే గత బిఆర్‌ఎన్ ప్రభుత్వం దానిని రద్దు చేసి కేవలం ఒకటిన్నర శాతం కేటాయించి వడ్డెరులకు తీరని అన్యాయం చేసిందని, తిరిగి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వడ్డెరుల అభివృద్ధికి  మైనిం గ్ కార్పొరేషన్,వడ్డెర ఫెడరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్లుగా వడ్డెరులను నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధన్యతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకు లు వల్లెపు బాల్రాజ్ గణేష్, గిరిష్ వల్లపు రవి, రాహుల్, మహేష్, కుంచ పు యాదగిరి, గోగుల పరుమేష్, సం ఘం రాష్ట్ర నాయకులు వల్లెపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.